Advertisement

  • చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో భూ ప్రకంపనలు

చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో భూ ప్రకంపనలు

By: chandrasekar Tue, 01 Dec 2020 12:02 PM

చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో భూ ప్రకంపనలు


ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో భూ ప్రకంపనలు ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి మూడుసార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం కాప్పలి గ్రామంలో భూమి కంపించినట్టు అనిపించడంతో తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రాంతంలో భూమి లోపలి నుంచి భారీగా శబ్దాలు వస్తున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు మూడుసార్లు భూమి కంపించిందని చెబుతున్నారు. తాజాగా, నివర్ తుఫాన్ కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో నీరు భూమి లోపలి పొరలకు ఇంకి ఉంటుందనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు బోరబండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా ఇలాగే భూ ప్రకంపలు రావడం, భూమి లోపలి నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. అక్కడకు వెళ్లిన భూగర్భ శాస్త్రవేత్తలు భారీ వర్షాల వల్ల నీరు భూమి లోపలి భాగాల్లోకి ఇంకి ఉంటుందని, అందుకే అలాంటి శబ్దాలువచ్చి ఉంటాయని చెప్పారు. అనూహ్యంగా నీరు భూమి అడుగున పొరల్లో చేరడం వల్ల శబ్దాలు వెలువడినట్లు తెలుస్తుంది.

Tags :
|

Advertisement