Advertisement

  • టర్కీ, గ్రీస్ లో భూకంపం...కూలిన బహుళ అంతస్తుల భవనాలు

టర్కీ, గ్రీస్ లో భూకంపం...కూలిన బహుళ అంతస్తుల భవనాలు

By: chandrasekar Sat, 31 Oct 2020 1:36 PM

టర్కీ, గ్రీస్ లో భూకంపం...కూలిన బహుళ అంతస్తుల భవనాలు


శుక్రవారం గ్రీకు ద్వీపం సమోస్‌కు ఉత్తరాన టర్కీ ఏజియన్ తీరాన్ని శక్తివంతమైన భూకంపం తాకింది. టర్కీలోని పశ్చిమతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని అజ్మిర్‌ ప్రావిన్స్‌లోని ఇజ్మీర్‌ నగరంతోపాటు రాజధాని ఇస్తాంబుల్‌, గ్రీస్‌లోని ఏథెన్స్‌ నగరాలు ప్రకంపనల ధాటికి వణికిపోయాయి.

ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది. ప్రకంపనల తీవ్రతకు అజ్మిర్‌ నగరంలోని పలు భవనాలు కూలిపోయినట్లు సమాచారం. పలు వీధుల్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

భూకంపం కారణంగా సముద్రంలో స్వల్ప సునామీ సంభవించి వీధుల్లోకి నీరు చేరింది. ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు టర్కీ అత్యవసర విపత్తు స్పందనా దళం పేర్కొంది.

Tags :
|

Advertisement