Advertisement

  • ఏజియన్ సముద్రంలో భూకంపం...వీధుల్లోకి సముద్రపు అలలు...

ఏజియన్ సముద్రంలో భూకంపం...వీధుల్లోకి సముద్రపు అలలు...

By: chandrasekar Sat, 31 Oct 2020 1:34 PM

ఏజియన్ సముద్రంలో భూకంపం...వీధుల్లోకి సముద్రపు అలలు...


గ్రీకు ద్వీపం సమోస్‌కు ఉత్తరాన టర్కీ ఏజియన్ తీరాన్ని శుక్రవారం శక్తివంతమైన భూకంపం తాకింది.

ఏజియన్‌ సముద్రంలో భూకంపం ధాటికి టర్కీ, గ్రీస్‌ రాజధాని నగరాలు ఇస్తాంబుల్‌, ఏథెన్స్‌తోపాటు టర్కీష్‌ నగరం ఇజ్మిర్‌ నగరాలు భయంతో వణికిపోయాయి.

ఇజ్మిర్‌లో 20పైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సముద్రంలో స్వల్ప సునామీ సంభవించిన కారణంగా నగరంలో పలు వీధుల్లోకి సముద్రపు అలలు చొచ్చుకొచ్చాయి.

సముద్రపు అలలు చొచ్చుకురావడం తీవ్ర సునామీకి హెచ్చరికగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు అధికారికంగా సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. ఏజియన్‌ సముద్ర తీర నగరాలకు భూకంపాలు పరిపాటి, గతంలోనూ భారీ భూకంపాలు వచ్చాయి.

Tags :
|

Advertisement