Advertisement

బీహార్ తొలిదశ పోలింగ్ ప్రారంభం...

By: chandrasekar Wed, 28 Oct 2020 11:14 AM

బీహార్ తొలిదశ పోలింగ్ ప్రారంభం...


బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేసారు. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి దశ పోలింగ్ రేపు అంటే అక్టోబర్ 28న జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీష్ కుమార్ మరోసారి బరిలో ఉండగా మహా ఘట్బంధన్ తరపున తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.

మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ అసెంబ్లీకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలిదశ పోలింగ్ 71 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28న, రెండోదశ పోలింగ్ నవంబర్ 3వ తేదీన, మూడోదశ పోలింగ్ నవంబర్ 7 వతేదీన జరగనుంది. నవంబర్ 10 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రచారం సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు తీవ్రమయ్యాయి. ఇరు పక్షాల తరపున భారీగా ప్రచారం సాగింది.

Tags :
|
|

Advertisement