Advertisement

  • ధోనికి వేసిన ఆ ఓవర్ నా కెరీర్లోనే పెద్ద సక్సెస్ .. డ్వేన్ బ్రావో

ధోనికి వేసిన ఆ ఓవర్ నా కెరీర్లోనే పెద్ద సక్సెస్ .. డ్వేన్ బ్రావో

By: Sankar Wed, 26 Aug 2020 11:25 AM

ధోనికి వేసిన ఆ ఓవర్ నా కెరీర్లోనే పెద్ద సక్సెస్ ..  డ్వేన్ బ్రావో


ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్ ఈ మాట వింటే ఎవరికీనా ముందుగా గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని..తన ఆటతీరుతో ఎన్ని మ్యాచ్ లలో టీం ఇండియాకు చివరి ఓవర్లలో ధోని విజయాలను అందించాడు..చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ లో ఉంటె ఒత్తిడి బౌలర్ మీద ఉంటుంది కానీ ధోని మీద కాదు అని ఒక ప్రముఖ క్రికెటర్ వ్యాఖ్యానించాడు..అయితే ఇటీవల ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తడి చెన్నై సహచరుడు బ్రేవో ధోనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు..

మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ధోనీ అస్సలు కంగారుపడడని చెప్పుకొచ్చిన డ్వేన్ బ్రావో.. 2016లో ఫ్లోరిడా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్.. ఓపెనర్ ఎవిన్ లావిస్ సెంచరీ బాదడంతో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్ జట్టు... ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపు సెంచరీ సాధించడంతో అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. ఆఖరి ఓవర్‌లో మహేంద్రసింగ్ ధోనీ తడబాటు కారణంగా.. విండీస్ చేతిలో ఒక పరుగు తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసింది డ్వేన్ బ్రావోనే.

వరల్డ్‌లోనే బెస్ట్ ఫినిషరైన ధోనీ క్రీజులో ఉన్నప్పటికీ.. ఆ మ్యాచ్‌లో ఆరు పరుగుల్ని నేను కట్టడి చేయగలిగాను. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి.. అతడ్ని ఆ మ్యాచ్‌లో నేను నిలువరించడం నా కెరీర్‌లో పెద్ద సక్సెస్‌గా భావిస్తాను. ధోనీకి మరిన్ని ఓవర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేయాలని ఆశించాను. కానీ.. ఇక అవకాశం లేదు. ఒక ప్లేయర్‌గా ధోనీ అస్సలు కంగారుపడడు. ఎంత ఒత్తిడినినైనా అతను అధిగమించగలడు. అలానే సహచరుల్లోనూ అతను నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. గొప్ప కెప్టెన్ల లక్షణం అది’’ అని డ్వేన్ బ్రావో వెల్లడించాడు.

Tags :
|
|
|

Advertisement