Advertisement

  • పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఘర్షణ తప్పేలాలేదు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఘర్షణ తప్పేలాలేదు

By: chandrasekar Mon, 14 Sept 2020 4:54 PM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఘర్షణ తప్పేలాలేదు


పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేవలం తమ బిల్లులు, ఆర్జినెన్సులను ఆమోదింపజేసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉండగా ప్రతిపక్షాలు మాత్రం సరిహద్దుల్లో చైనా దురాక్రమణ, రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిల చెల్లింపు, వలస కార్మికుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను లేవనెత్తేందుకు సిద్ధపడుతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి పోటీ చేయాలని భావిస్తున్నాయి. తొలిరోజు సోమవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తదితరుల స్మృత్యర్థం ఉభయ సభల్లో నివాళులర్పిస్తారు. ఆ వెంటనే సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి,

కాగా, పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే ఎంపీల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అనేక మంది ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంటున్నాయి.

ఆదివారం జరిగిన లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో.. చైనాతో వివాదంపై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాల్పిందిగా స్పీకర్‌ను కోరినట్లు టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో శనివారం ఎయిమ్స్‌లో చేరారు.

Tags :
|

Advertisement