Advertisement

  • ఈ సారి దుర్గమ్మ తెపోత్సవం జరిగేనా ..కృష్ణ నదిలో భారీగా వరద ఉదృతి...

ఈ సారి దుర్గమ్మ తెపోత్సవం జరిగేనా ..కృష్ణ నదిలో భారీగా వరద ఉదృతి...

By: Sankar Fri, 23 Oct 2020 5:07 PM

ఈ సారి దుర్గమ్మ తెపోత్సవం జరిగేనా ..కృష్ణ నదిలో భారీగా వరద ఉదృతి...


దసరా పండగ అనగానే ప్రతి ఏడాది తెలుగు వారందరికి గుర్తొచ్చే వాటిలో ఒకటి విజయవాడ కృష్ణ నదిలో అమ్మవారి తెపోత్సవం అయితే ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణ నదిలో భారీగా వరదనీరు రావడంతో తెపోత్సవం నిర్వహణ మీద అనుమానాలు నెలకొన్నాయి.. దసరా ఉత్సవాల ఆఖరి రోజు క్రిష్ణానది లో దుర్గమ్మ నదీ విహారంపై సందిగ్ధత నెలకొంది.

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ నెల 25 న తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై డైలమాలో దుర్గగుడి అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రకాశం బ్యారేజి వద్ద 3 లక్షల 77 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. తెప్పోత్సవానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ తెప్పోత్సవం నిర్వహణ మీద సందిగ్దత నెలకొంది.

క్రిష్ణానది లో వరద ఉధ్రుతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో వరద ఉధ్రుతి తగ్గినా క్రుష్ణానది లో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యపడదంటున్నారు నిపుణులు. మరో పక్క దుర్గగుడి అధికారులు ఇప్పటికే హంస వాహనాన్ని సిద్దం చేస్తున్నారు. దీంతో ఆదివారం వరద ఉధ్రుతి ఇలానే కొనసాగితే తెప్పోత్సవాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై తర్జన బర్జన పడుతునన్నారు అధికారులు.

Tags :

Advertisement