Advertisement

  • కోల్‌కతాలో దుర్గా దేవి పూజా కార్యక్రమాలు...పూజ కమిటీలకు రూ.50 వేలు

కోల్‌కతాలో దుర్గా దేవి పూజా కార్యక్రమాలు...పూజ కమిటీలకు రూ.50 వేలు

By: chandrasekar Fri, 25 Sept 2020 3:14 PM

కోల్‌కతాలో దుర్గా దేవి పూజా కార్యక్రమాలు...పూజ కమిటీలకు రూ.50 వేలు


ప్రతి ఏటా కోల్‌కతాలో దసరా సందర్భంగా దుర్గా దేవి పూజా కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తారు. దుర్గా పూజ కమిటీలకు రూ.50 వేల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అలాగే 80 వేల మంది వీధి వ్యాపారులకు రూ.2,000 చొప్పున దుర్గా పూజకు ముందే ఇస్తామని చెప్పారు. ఏర్పాటు చేసే మండపాలు నాలుగు వైపులా తెరిచే ఉండాలని, ప్రవేశాల వద్ద శానిటైజర్లు ఉంచాలని వివరించారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి మమత పేర్కొన్నారు. దుర్గా పూజ మండపాల వద్ద సంస్కృతిక కార్యక్రమాలను అనుమతించబోమని తెలిపారు. గురువారం దుర్గా పూజ ఏర్పాట్లపై సమీక్షించిన మమతా బెనర్జీ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దసరా సందర్భంగా ప్రతి ఏటా కోల్‌కతాలో దుర్గా దేవి పూజా కార్యక్రమాలను భారీగా నిర్వహిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి సీఎం అనుమతించడం లేదంటూ ఇటీవల వదంతులు రాగా మమతా బెనర్జీ వాటిని ఖండించారు. కరోనా నిబంధనల మేరకు దుర్గా పూజల కోసం మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

Tags :

Advertisement