Advertisement

  • ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించిన హాంకాంగ్

ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించిన హాంకాంగ్

By: Sankar Tue, 18 Aug 2020 1:00 PM

ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించిన హాంకాంగ్


కరోనా వైరస్ మహమ్మారి కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశాలకు చేరవేస్తున్న ఎయిరిండియా విమాన సర్వీసులకు హాంకాంగ్ లో ఎదురు దెబ్బ తగిలింది. భారతదేశం నుంచి వస్తున్నఎయిరిండియా విమాన ప్రయణీకుల ద్వారా వైరస్ సోకుతోందన్న కారణంగా నగరంలోకి ఎయిరిండియా సర్వీసులను రెండు వారాల పాటు నిషేధించింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఆగస్టు18 నుండి ఆగస్టు 31 వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది.

ఆగస్టు 14న న్యూఢిల్లీనుంచి వచ్చిన వారిలో 11మందికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీ-ఫ్లైట్ టెస్టింగ్ పేలవంగా ఉన్నాయని ఆరోపించింది. ఒకే విమానంలో 11 మందికి వైరస్ నిర్దారణ కావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్న హాంకాంగ్ ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం హాంకాంగ్‌లో ల్యాండ్ కావాల్సిన ఎయిరిండియా చార్టర్ విమానానికి అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ట్విటర్ లోధృవీకరించింది. ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంక్షల కారణంగా వాయిదా 2020 ఆగస్టు 18 నాటి విమానం వాయిదా పడిందనీ, సంబంధిత విరాలను త్వరలో తెలియచేస్తామని ట్వీట్ చేసింది.


Tags :
|

Advertisement