Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి చేరిన టీఆర్ఎస్‌ నేత

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి చేరిన టీఆర్ఎస్‌ నేత

By: chandrasekar Wed, 07 Oct 2020 6:55 PM

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి చేరిన టీఆర్ఎస్‌ నేత


టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి తండ్రి ముత్యంరెడ్డి ఆదర్శ నాయకుడని అన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని అని ఉత్తమ్ ప్రజలను కోరారు.

ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న సొమ్మును దుబ్బాకలో పంచుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలని కోరారు. సోనియా గాంధీ అనుమతితో బుధవారం అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డిని ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం ఈ సమావేశంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో జరుగుతున్నవి ఆత్మగౌరవ ఎన్నికలు అని ఆయన అభిప్రాయపడ్డారు. తన తండ్రి ముత్యంరెడ్డి కలలు సాకారం కావాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు సూచించారు. దుబ్బాకలో ఐదు మార్కెట్ యార్డులు కట్టించిన ఘనత ముత్యం రెడ్డిదేనని గుర్తు చేసారు. ముత్యం రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఆ నాయకులు మోసం చేస్తేనే గుండె పలిగి చనిపోయారని తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. తాము తన నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ముత్యంరెడ్డి మరణాన్ని రిటర్న్‌గిఫ్ట్‌గా ఇచ్చారని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డి ఆ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన ఆఖరి రోజుల్లో ప్రభుత్వం తరఫున ప్రత్యేక చికిత్స అందించేలా కేసీఆర్ చొరవ చూపారు.

Tags :
|

Advertisement