Advertisement

దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల...

By: Sankar Tue, 29 Sept 2020 3:34 PM

దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల...


తెలంగాణలోని మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు సంబందించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. అక్టోబర్ 16 వ తేదీ నామినేషన్లకు చివరి తేదీకాగా, నామినేషన్లను అక్టోబర్ 17న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19. ఇక నవంబర్ 3 వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 10న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.

తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఈరోజు నుంచే దుబ్బాక నియోజక వర్గంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.కాగా ఈ ఉప ఎన్నికలో బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది..

Tags :

Advertisement