Advertisement

  • ప్రశాంతంగా సాగుతున్న దుబ్బాక బై ఎలక్షన్ పోలింగ్ ...ఇప్పటివరకు 71 శాతం పోలింగ్ నమోదు

ప్రశాంతంగా సాగుతున్న దుబ్బాక బై ఎలక్షన్ పోలింగ్ ...ఇప్పటివరకు 71 శాతం పోలింగ్ నమోదు

By: Sankar Tue, 03 Nov 2020 4:08 PM

ప్రశాంతంగా సాగుతున్న దుబ్బాక బై ఎలక్షన్ పోలింగ్ ...ఇప్పటివరకు 71 శాతం పోలింగ్ నమోదు


దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 7గంటలకు ప్రారంభమయిన పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. కాగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి.ఇక దుబ్బాకలో పోలింగ్‌ సరళిని సిద్దిపేట తన నివాసం నుంచి మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు.

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి వివిధ మండలాల ఇంచార్జ్‌లు ఆయనతో పాటు ఉన్నారు. కాగా, తొగుట మండలం వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కు వినియోగించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాస్క్,గ్లౌస్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేస్తున్నారు. దుబ్బాక మండలం పోతారంలో కుటుంబసభ్యులతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు.

ఇక మరోవైపు చేగుంటలో దొంగ ఓటు నమోదయ్యింది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లారు. పోలింగ్‌ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్‌ ఓటుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇచ్చారు.

Tags :
|

Advertisement