Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక ..కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి !

దుబ్బాక ఉప ఎన్నిక ..కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి !

By: Sankar Mon, 05 Oct 2020 12:00 PM

దుబ్బాక ఉప ఎన్నిక ..కాంగ్రెస్ అభ్యర్థిగా  నర్సారెడ్డి !


మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే... ఉప ఎన్నికకు సంబందించిన ఎన్నికల షెడ్యూల్ ను ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. అక్టోబర్ 16 వ తేదీ నామినేషన్లకు చివరి తేదీకాగా, నామినేషన్లను అక్టోబర్ 17న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19. ఇక నవంబర్ 3 వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 10న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.

దీంతో దుబ్బాకపై అన్ని పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్నారు నాయకులు. అయితే...టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట భార్యకు టికెట్‌ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతల సూచన మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా అధిష్టానానికి ప్రతిపాదించాలని ఆదివారం పార్టీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీకి కూడా నర్సారెడ్డి పేరు పంపారు. అధిష్టానం ఆమోదం పొందిన మరుక్షణం ఆయన పేరును ప్రకటించనున్నారు.



Tags :

Advertisement