Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్...సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్...సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు

By: chandrasekar Tue, 03 Nov 2020 10:47 AM

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్...సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు


దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభంమైంది. ఓటర్ల వచ్చి ఓట్లు వేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,98, 807. వీరిలో మహిళలు ఒక 1,00,779 మంది కాగా పురుషులు 98,0 28 మంది ఉన్నారు. దుబ్బాకలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 315. కరోనా కారణంగా పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచారు అధికారులు. మాస్క్ ఉంటేనే పోలింగ్ కేంద్రంలోపలకు అనుమతి ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 89 సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాలుగా గుర్తించారు. కరోనా ప్రోటోకాల్ లో భాగంగా.. సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధన పాటిస్తామని, ఏఎన్ఎమ్ అందుబాటులో ఉంటారని, గ్లౌజులు ఇస్తామని తెలిపారు.

శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారికి స్లిప్పులు ఇచ్చి.. చివరి గంటలో ఓటింగ్ కు అనుమతి ఇస్తామని చెప్పారు అధికారులు. సాయంత్రం 5 నుంచి 6 గంటలలోపు... టెంపరేచర్ ఎక్కువగా ఉన్నవారికి పోలింగ్‌కు అవకాశం కల్పిస్తారు. మరోవైపు పోలీంగ్ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. కోవిడ్‌ కారణంగా పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్‌ లేకుండా ఓటు వేయడానికి ఎవరినీ అనుమతించరు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి శానిటైజర్ కూడా అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 86 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు దుబ్బాకలో మరో 20 మంది అభ్యర్థులు పోటీకి దిగారు.

Tags :
|

Advertisement