Advertisement

  • యూఏఈలో ప్ర‌వాస భార‌తీయుడు త‌న నిజాయితీని చాటగా దుబాయ్ పోలీసుల స‌న్మాన౦

యూఏఈలో ప్ర‌వాస భార‌తీయుడు త‌న నిజాయితీని చాటగా దుబాయ్ పోలీసుల స‌న్మాన౦

By: chandrasekar Mon, 14 Sept 2020 12:28 PM

యూఏఈలో ప్ర‌వాస భార‌తీయుడు త‌న నిజాయితీని చాటగా దుబాయ్ పోలీసుల స‌న్మాన౦


యూఏఈలో ప్ర‌వాస భార‌తీయుడు ఒక‌రు త‌న‌కు దొరికిన బ్యాగులో రూ. ల‌క్ష 38వేల న‌గ‌దు, సుమారు రూ. 40 ల‌క్ష‌లు విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాలను తీసుకెళ్లి దుబాయ్ పోలీసుల‌కు అప్ప‌గించారు.

భార‌త్‌కు చెందిన రిచ్ జేమ్స్ క‌మ‌ల్ కుమార్ అనే భార‌తీయుడు ఇలా త‌న నిజాయితీని చాటుకున్నారు. త‌న‌కు దొరికిన లక్ష‌ల రూపాయలు క‌లిగి ఉన్న‌ బ్యాగును అల్ క్వైసీస్ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ఎంతో నిజాయితీగా త‌న‌కు దొరికిన బ్యాగును తెచ్చి పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించినందుకు శ‌నివారం ఆయ‌న‌ను దుబాయ్ పోలీసులు స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా దుబాయ్ పోలీస్ అధికారులు క‌మ‌ల్ కుమార్‌కు ప్ర‌త్యేక ప్ర‌శంస ప‌త్రాన్ని అంద‌జేశారు. త‌న‌కు ద‌క్కిన ఈ ప్ర‌త్యేక గుర్తింపు ప‌ట్ల క‌మ‌ల్ కుమార్ దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు గర్వకారణమని తెలిపారు.

Tags :
|

Advertisement