Advertisement

గంజాయి అమ్ముతున్న డెలివరీ బాయ్‌ అరెస్ట్

By: Sankar Fri, 20 Nov 2020 7:39 PM

గంజాయి అమ్ముతున్న  డెలివరీ బాయ్‌ అరెస్ట్


కెనడాలో ఉన్నత చదువులు చదివిన ఓ హైదరాబాద్‌ యువకుడు.. మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కానీ, గంజాయికి బానిసై ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడు.

చివరికి డెలివరీ బాయ్‌గా మారి గంజాయి విక్రయిస్తూ..ఆబ్కారీ పోలీసులకు పట్టుబడ్డాడు. సికింద్రాబాద్‌ కవాడీగూడకు చెందిన బాలాజీసింగ్‌ కెనడాలో ఎం.ఎస్‌ పూర్తి చేసి... ఫేస్‌బుక్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసై జాబ్‌ కోల్పోయాడు. దీంతో ఉపాధి కోసం డెలివరీ బాయ్‌గా మారాడు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలో చేరి.. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే దూల్‌పేటలోని గంజాయి విక్రేతలతో పరిచయం పెంచుకున్నాడు బాలాజీ సింగ్‌.

వాళ్లు ఇచ్చే గంజాయిని గచ్చిబౌలిలోని కొందరు ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌లోని హాస్టల్‌ విద్యార్థులకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లిన బాలాజీ సింగ్‌ గంజాయితో పాటు మత్తు ద్రావణాన్ని నగరానికి తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్ల లో నింపి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు బాలాజీసింగ్‌ను అరెస్టు చేశారు

Tags :
|
|

Advertisement