Advertisement

  • కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ కేసు క‌ల‌క‌లం... పోలీసుల అదుపులో నటి సంజనా

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ కేసు క‌ల‌క‌లం... పోలీసుల అదుపులో నటి సంజనా

By: chandrasekar Tue, 08 Sept 2020 7:50 PM

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ కేసు క‌ల‌క‌లం... పోలీసుల అదుపులో నటి సంజనా


సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్ బెంగళూరు పోలీసులు డ్రగ్స్‌ మాఫియాతో చందన సీమలో పలువురు నటీనటులకు సంబంధాలున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రశ్నించడం కోసం బెంగళూరు పోలీసులు మంగళవారం నటి సంజనా గల్రానిని సీసీబీ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు.

ఈ రోజు ఉదయం సంజానా ఇంటిపై సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుడు రాహుల్‌ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా సంజనా నివాసంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రశ్నిస్తున్న రెండో నటి సంజనా. ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలతో అరెస్టైన నటి రాగిని ద్వివేదిని విచారిస్తున్నారు పోలీసులు.

Tags :

Advertisement