Advertisement

  • కరోనా సోకకుండా బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారట .. !

కరోనా సోకకుండా బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారట .. !

By: Anji Fri, 28 Aug 2020 2:09 PM

కరోనా సోకకుండా బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారట .. !

కరోనా మహమ్మారి రోజురోజుకి ప్రపంచంలో అందరిని భయపెడుతుంది. కరోనా వెలుగులోకి వచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కరోనా ని నాశనం చేసే సరైన వ్యాక్సిన్ ఒక్కటి కూడా రాకపోవడంతో దీన్ని అరికట్టలేకపోతున్నారు. కరోనా సోకకుండా ప్రభుత్వాధికారులు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రజలు వేడి నీళ్లు తాగుతూ కరోనా నిబంధనలు పాటిస్తుంటే..

ప్రభుత్వ యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ కరోనా వైరస్ ను చంపుతుంది కదా అని నార్త్ టెక్సాస్లో కొందరు బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవాన్ని తాగేస్తున్నారట. అనంతరం అస్వస్థతకు గురవుతున్నారు. ఇలా ఆగస్టు నెలలో ఇప్పటి వరకు దాదాపు 50 మంది బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారట.

దీంతో ఇలాంటి తప్పుడు సమాచారాలను నమ్మొద్దంటూ టెక్సాస్ పాయిజన్ సెంటర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. బ్లీచింగ్ పౌడర్ ద్రవం తాగితే వాంతులు విరేచనాలు రక్తప్రసరణలో సమస్యలు కాలేయం దెబ్బతినడం వంటివి జరుగుతాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) వెల్లడించిందని తెలిపింది.

Tags :

Advertisement