Advertisement

  • ధోని స్థానంపై కన్నేసిన టీమిండియా సీనియర్ ఆటగాడు

ధోని స్థానంపై కన్నేసిన టీమిండియా సీనియర్ ఆటగాడు

By: Sankar Tue, 25 Aug 2020 09:46 AM

ధోని స్థానంపై కన్నేసిన టీమిండియా సీనియర్ ఆటగాడు


స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ కావడంతో ఇండియాలో ఉన్న కీపర్లలో మల్లి టీమిండియా లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆశలు చిగురిస్తున్నాయి..ధోని టీం లో ఉన్న అన్ని రోజులు వేరే కీపర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉండేది దీనితో ధోని సమకాలీన కీపర్లు అయిన దినేష్ కార్తీక్ , పార్థివ్ పటేల్ , రాబిన్ ఊతప్ప వంటి వారు డొమెస్టిక్ క్రికెట్కు పరిమితం అయ్యారు..

అయితే కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే కొన్ని మ్యాచ్‌ల్లో టీం ఇండియా కు ఆడిన రాబిన్ ఉతప్ప.. ఆఖరిగా భారత్ తరఫున 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్ ఆడుతున్న రాబిన్ ఉతప్పకి గత ఐదేళ్లుగా అవకాశమే దక్కలేదు. కానీ.. ఈ నెల 15న ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో మళ్లీ అతని రీఎంట్రీ ఆశలు చిగురించినట్లు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరుగ్గా రాణించగలిగితే.. మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని మీరు విశ్వసిస్తున్నారా..? అని రాబిన్ ఉతప్పని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘‘అవును నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఐపీఎల్‌లో నేను నిలకడగా రాణించగలిగి.. మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడితే..? తప్పకుండా మళ్లీ టీమిండియాలోకి సెలెక్ట్ అవుతా. కాంపిటేటివ్ క్రికెట్ ఆడేవాళ్ల ప్రతి ఒక్కరి కల దేశం తరఫున ఆడటం. కాబట్టి.. టీమిండియాకి మళ్లీ ఆడాలనే నా కల ఇప్పటికీ సజీవంగానే ఉంది’’ అని ఉతప్ప వెల్లడించాడు

Tags :
|

Advertisement