Advertisement

  • ఐపీయల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా డ్రీం 11..స్పాన్సర్షిప్ విలువ 222 కోట్లు

ఐపీయల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా డ్రీం 11..స్పాన్సర్షిప్ విలువ 222 కోట్లు

By: Sankar Tue, 18 Aug 2020 3:47 PM

ఐపీయల్ 2020 టైటిల్ స్పాన్సర్ గా డ్రీం 11..స్పాన్సర్షిప్ విలువ 222 కోట్లు


ఐపీయల్ 2020 స్పాన్సర్ షిప్ హక్కులను డ్రీం 11 దక్కించుకుంది..ఇందుకుగాను బీసీసీఐకి రూ.222 కోట్లు డ్రీమ్ ఎలెవన్ చెల్లించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు. 2018 నుంచి చైనాకి చెందిన వివో కంపెనీ టైటిల్ స్ఫాన్సర్‌గా ఉండగా.. ఇటీవల భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా.. వివో ఐపీయల్ నుంచి తప్పుకుంది అనంతరం బిడ్స్‌ని ఆహ్వానించగా.. టాటా సన్స్, రిలయన్స్ జియో, అన్‌అకాడమీ, బైజూస్ తదితర పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడ్డాయి.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ జరగనుండగా.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు. దానికితోడు టోర్నీ సమయంలోనే దసరా, దీపావళి పండగలు కూడా వస్తుండటంతో.. టోర్నీ వ్యూవర్‌షిప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

కాబట్టి.. స్ఫాన్సర్‌షిప్‌ కోసం పెద్ద మొత్తంలో బిడ్ వేసిన కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. బీసీసీఐ మాత్రం ఫాంటసీ గేమింగ్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్ ఎలెవన్‌కే ఓటేసింది. దానికి కారణం.. డ్రీమ్‌ ఎలెవన్ పక్కా స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ కావడమేనని తెలుస్తోంది.



Tags :
|
|
|
|

Advertisement