Advertisement

  • ద్రావిడ్ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి ..జీవితం ఎలా బతకాలో చెప్పాడు ..పుజారా

ద్రావిడ్ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి ..జీవితం ఎలా బతకాలో చెప్పాడు ..పుజారా

By: Sankar Sun, 28 June 2020 09:47 AM

ద్రావిడ్ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి ..జీవితం ఎలా బతకాలో చెప్పాడు ..పుజారా



రాహుల్ ద్రావిడ్ ..ఇండియన్ క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు ..ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో ద్రావిడ్ ను మించిన ఆటగాడు లేదు అని ఇటీవల ఒక సర్వేలో తేలింది ..మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే దుర్బిడ్ ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు ..అయితే ద్రావిడ్ రిటైర్ అయినా తర్వాత అత్యంత కీలకమైన మూడో స్థానంలో చేటేశ్వర్ పుజారా బరిలో దిగుతున్నాడు .అచ్చం ద్రావిడ్ లాగే ఆడుతూ ద్రావిడ్ లేని లోటును చాలా వరకు పూడుస్తున్నాడు ..అయితే ఆ తీరులో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఈ ఇద్దరికి చాల పోలికలు ఉంటాయి ..

ఈ విషయాన్ని పుజారా కూడా అంగీకరిస్తాడు. నిజానికి ఆటతో పాటు వ్యక్తిగతంగా కూడా తనపై ద్రవిడ్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పుజారా చెప్పాడు. చిన్నప్పటి నుంచి ద్రవిడ్‌ ఆటను చూస్తూ పెరిగానని... తనంతట తానుగా అనుకరించకపోయినా ఆ శైలి వచ్చేసిందని అతను అన్నాడు. ‘చిన్నప్పటి నుంచి ద్రవిడ్‌ ఆటను నేను చాలా బాగా పరిశీలించేవాడిని. పట్టుదలగా క్రీజులో నిలవడం, సులువుగా వికెట్‌ ఇవ్వకపోవడం నా మనసులో ముద్రించుకుపోయాయి. ఆయనను ఇంతగా అభిమానించినా అనుకరించాలని మాత్రం అనుకోలేదు. ఇద్దరి శైలి ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే.

దేశవాళీలో ఒకప్పుడు బలహీనమైన సౌరాష్ట్ర తరఫున ఆడటంతో జట్టు కోసం సుదీర్ఘంగా క్రీజ్‌లో పాతుకుపోవాల్సి వచ్చేది. అది అలా అలవాటైంది. భారత జట్టు తరఫున ఆయనతో కలిసి ఆడినప్పుడు మాత్రం పలు సూచనలిచ్చారు. టెక్నిక్‌పై దృష్టి పెడితే సరిపోదని ఇంకా ఇతర అంశాలపై కూడా పట్టు సాధించాలని ద్రవిడ్‌ నాకు సూచించారు’ అని పుజారా వెల్లడించాడు. క్రికెట్‌ బయట కూడా జీవితం ఉంటుందని, అప్పుడు ఎలా ఉండాలో ద్రవిడ్‌ నేర్పించాడని పుజారా గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్‌ మాత్రమే కాకుండా జీవితం ప్రాధాన్యత ఏమిటో నేను అర్థం చేసుకునేలా ఆయన చేశారు. ఆట ముగిశాక ఎలా ఉండాలో నేర్పించారు. ప్రొఫెషనల్‌ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఎలా భిన్నంగా చూడాలో కౌంటీ క్రికెట్‌లో నాకు తెలిసింది. ద్రవిడ్‌ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి. నాపై ఆయన ప్రభావం ఏమిటో ఒక్క మాటలో చెప్పలేను’ అని పుజారా తన అభిమానాన్ని ప్రదర్శించాడు.

Tags :
|
|

Advertisement