Advertisement

  • నేపాల్ భూభాగాన్ని స్వాహా చేస్తున్న డ్రాగన్ కంట్రీ

నేపాల్ భూభాగాన్ని స్వాహా చేస్తున్న డ్రాగన్ కంట్రీ

By: chandrasekar Sat, 22 Aug 2020 8:53 PM

నేపాల్ భూభాగాన్ని స్వాహా చేస్తున్న డ్రాగన్ కంట్రీ


నేపాల్ భూభాగాన్ని డ్రాగన్ కంట్రీ కొంచం కొంచంగా స్వాహా చేస్తున్నది. దీనిపై నేపాల్ ప్రధాని స్పందించినట్లు కనబడుట లేదు. చైనా ఆక్రమణ రోజు రోజుకి విస్తరిస్తా వుంది. ఇంతకు మునుపే నేపాల్ చుట్టూ వున్నా గ్రామాలను కొంచం కొంచంగా ఆక్రమిస్తూ వుంది. ఇప్పుడేమో మరింతగా చైనా మెల్లగా కబళిస్తోంది. తమ దేశంలోని 7 బోర్డర్ జిల్లాల్లో చాలా భూభాగాలను డ్రాగన్ కంట్రీ చేజిక్కించుకుందని నేపాల్ వాపోతోంది. సాక్షాత్తూ నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సర్వే విభాగమే ఆయా జిల్లాల్లోని పరిస్థితిని సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్ద దేశమైన చైనాను ఎదిరించలేకుంది.

నేపాలేమో ఇది అక్రమ చొరబాటే అని నిర్ధారించింది. ఇంత జరుగుతున్నా ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సర్కార్ కిమ్మనడంలేదు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలను ఎదిరిస్తే తమకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ప్రభుత్వం భయపడుతోందని అంటున్నారు. నేపాల్ లో డోలఖా, దార్చులా, హుమ్లా, రసువా తదితర జిల్లాల్లో చైనీయులు యథేచ్ఛగా తిరుగుతున్న నేపాలీలు కళ్ళుమూసుకుని తలవంచుకుని పోతున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ దేశాన్ని ఎదిరించలేక మొత్తానికి మరికొన్ని నెలల్లో చైనా నేపాల్ తో గల తమ సరిహద్దుల్లో అన్ని నేపాల్ జిల్లాలను అక్రమంగా ఆక్రమించుకున్నా ఓలి సర్కార్ దాసోహమనే తీరులో ఉన్నట్టు కనిపిస్తోంది. నేపాల్ కు వచ్చే నీటి వనరులపై కూడా చైనా డ్యాంలను నిర్మిస్తావుంది.

Tags :
|

Advertisement