Advertisement

  • రష్యా వాక్సిన్ కు షాకిచ్చిన ఇండియా ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ

రష్యా వాక్సిన్ కు షాకిచ్చిన ఇండియా ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ

By: Sankar Tue, 06 Oct 2020 10:18 PM

రష్యా వాక్సిన్ కు షాకిచ్చిన ఇండియా ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ


కరోనా వైరస్ కు రష్యా ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ ను రిలీజ్ చేసింది. ఈ వ్యాక్సిన్ ను రష్యాతో పాటు ఐదు దేశాలు ఉత్పత్తి చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. అయితే, ఇండియాలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ రష్యా స్పుత్నిక్ వి వాక్సిన్ ను ఇండియాలో తయారు చేసేందుకు అనుమతులు పొందింది.

అయితే, స్పుత్నిక్ వి వాక్సిన్ ఇండియాలో మూడోదశ ప్రయోగాలు చేసేందుకు గతంలో రెడ్డీస్ ల్యాప్ దరఖాస్తు చేసుకుంది. కానీ, ట్రయల్స్ కు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయడంతో డైరెక్ట్ గా మూడోదశ ప్రయోగాలు చేసేందుకు అనుమతి లేదని, మూడోదశ ట్రయల్స్ తో పాటుగా రెండోదశ ట్రయల్స్ ను కూడా ఇండియాలో నిర్వహించాలని, దానికి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ తెలిపింది. ఇక రష్యాలో స్పుత్నిక్ వి మూడో దశ ట్రయల్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. 40వేలమందిపై ట్రయల్స్ ను నిర్వహిస్తోంది. ట్రయల్స్ నిర్వహిస్తూనే, టీకాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది రష్యా.

Tags :
|

Advertisement