Advertisement

  • ఎన్నికలొస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు

ఎన్నికలొస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు

By: Sankar Wed, 30 Sept 2020 07:41 AM

ఎన్నికలొస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు


రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు హెచ్చరించారు. సామూహికంగా జరిపే కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.

ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేవారు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 15.42% యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ఢిల్లీ, అసోంలు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువగా టెస్టులు చేస్తున్నాయన్నారు. పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉన్న చోట టెస్టుల సంఖ్య పెంచామన్నారు..

రాష్ట్రంలో కరోనా బారినపడ్డవారిలో 84 శాతం మంది రికవరీ అయ్యారని, దేశంలోనే ఇది రికార్డు అని తెలిపారు. తెలంగాణ కంటే 23 రాష్ట్రాల్లో రికవరీ రేటు తక్కువగా ఉందన్నారు. సర్కారు ఆస్పత్రుల్లో 25.4% పడకలు నిండిపోగా... 74%పైగా ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 230 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తుండగా.. 34.56% పడకలు రోగులతో నిండి ఉన్నాయన్నారు. వీరిలో సగం మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులేనన్నారు.

అన్‌ లాక్‌ 5లో భాగంగా మిగిలినవన్నీ కూడా తెరుస్తారని చెప్పారు. ముందుగా చెప్పినట్లు సెప్టెంబర్‌ మాసాంతానికి కేసులు తగ్గుతాయన్న అంచనా నిజమైంద న్నారు. జీహెచ్‌ఎంసీలో కేసులు బాగా తగ్గాయన్నారు. రోజూ 300–350 పాజిటివ్‌ కేసులే వస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి రేటు జూలైలో 1.9 ఉండగా, ప్రస్తుతం అది 0.5 శాతానికి వచ్చిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 0.8 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, నల్లగొండ జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు

Tags :
|
|

Advertisement