Advertisement

  • గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియో మార్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌

గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియో మార్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌

By: chandrasekar Wed, 22 July 2020 4:59 PM

గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియో మార్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌


ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపార విభాగంలోకి దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రవేశించిన విషయం తెలిసిందే. జియో మార్ట్‌ పేరిట ఈ–కామర్స్‌ వెంచర్‌ను ప్రారంభించింది.

రిలయన్స్‌ రిటైల్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌లు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ జియో మార్ట్‌ తాజాగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్ల కోసం నయా యాప్‌ను విడుదల చేసింది.

జియో మార్ట్ అన్ని ఆర్డర్‌లపై కనీస ఆర్డరు నిబంధనలేవీ లేకుండానే ఉచిత హోమ్‌ డెలివరీ సర్వీసులు అందిస్తున్నది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 నగరాల్లో జియో మార్ట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియో మార్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమకు ఇష్టమైన మోడ్‌లో చెల్లింపులు చేయొచ్చు.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మాదిరిగానే జియో మార్ట్‌ యాప్‌లోనూ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వస్తువులను ఎంపిక చేసుకోని ఆర్డర్‌ చేయొచ్చు.

Tags :

Advertisement