Advertisement

  • ఒక్క గొర్రె ఖరీదు అక్షరాలా 3.5 కోట్లు..ఎక్కడో తెలుసా !

ఒక్క గొర్రె ఖరీదు అక్షరాలా 3.5 కోట్లు..ఎక్కడో తెలుసా !

By: Sankar Fri, 28 Aug 2020 7:49 PM

ఒక్క గొర్రె ఖరీదు అక్షరాలా 3.5 కోట్లు..ఎక్కడో తెలుసా !


సాధారణంగా మాంసం వినియోగం కోసం గొర్రెలను పెంచుతుంటారు. మాంసం కోసం వినియోగించే గొర్రెల ఖరీదు సాధారణంగా వేల రూపాయల్లో ఉంటుంది. అయితే, స్కాట్లాండ్ లో స్కాటిష్ లైవ్ స్టాక్ లో గొర్రెలను వేలం వేస్తుంటారు. ఈ వేలంలో డబుల్ డైమండ్ అనే గొర్రె ఏకంగా రూ.3.5 కోట్లు పలికింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా ఇది పేరు తెచ్చుకుంది. అంతకు ముందు ఇదే జాతికి చెందిన ఓ గొర్రె 2,31,000 స్టెర్లింగ్ పౌండ్ల ధర పలికింది. ఆ రికార్డును డబుల్ డైమండ్ బీట్ చేసింది. చార్లీ బోడెన్ అనే వ్యక్తి టెక్సిల్ జాతికి చెందిన మేలురకం గొర్రెలను పెంచుతున్నాడు. అందులో ఒకటి డబుల్ డైమండ్ కూడా ఒకటి. ధర ఈ స్థాయిలో ఉంటుందని ఊచించలేదని చార్లీ బోడెన్ పేర్కొన్నాడు.

చెషైర్‌, స్టాక్‌పోర్టుకు చెందిన ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి. టెక్సెల్‌ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్‌ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్‌ పౌండుల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్‌ కోసం ఉపయోగిస్తుంటారు.

Tags :
|
|

Advertisement