Advertisement

  • క‌మ‌ర్షియ‌ల్ అపార్ట్‌మెంట్ల త‌ర‌హాలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు...

క‌మ‌ర్షియ‌ల్ అపార్ట్‌మెంట్ల త‌ర‌హాలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు...

By: chandrasekar Wed, 16 Dec 2020 9:26 PM

క‌మ‌ర్షియ‌ల్ అపార్ట్‌మెంట్ల త‌ర‌హాలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు...


బుధవారం మంత్రి కేటీఆర్ వనస్థలిపురంలోని రైతు బజార్ సమీపంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించారు. ఆయన‌ మాట్లాడుతూ రైతు బజార్ సమీపంలో రూ.28 కోట్లతో మూడు బ్లాకుల్లో 324 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించామని అన్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల్లోనూ ఇలాంటి ఇళ్లు లేవు. ఒక్కో ఇంటికి రూ. 9 ల‌క్షల ఖ‌ర్చు పెట్టి నిర్మించా మ‌ని తెలిపారు. రెండు ప‌డ‌క‌ గ‌దులు, ఒక హాల్, కిచెన్‌తో పాటు రెండు బాత్రూమ్‌లను నిర్మించాం. దాదాపు రూ.50 ల‌క్షల విలువ చేసే ఫ్లాట్‌ను పేద‌ల‌కు సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే లిఫ్ట్ లాంటిదే ఈ డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. క‌మ‌ర్షియ‌ల్ అపార్ట్‌మెంట్ల త‌ర‌హాలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాం. ఇల్లు బాగుంటే స‌రిపోదు. ప‌రిస‌రాల‌ను కూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని ఈ గృహ స‌ముదాయాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.

Tags :
|

Advertisement