Advertisement

  • నిహారిక పెళ్లి హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదు: నాగబాబు

నిహారిక పెళ్లి హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదు: నాగబాబు

By: chandrasekar Sat, 04 July 2020 1:42 PM

నిహారిక పెళ్లి హడావుడిగా  పూర్తి చేయాలనుకోవడం లేదు: నాగబాబు


తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ కూడా పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు.

ఇంకోవైపు హీరో రానా దగ్గుబాటి కూడా త్వరలో మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అటు నితిన్ కూడా ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇన్ని రోజులు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు.

ఇప్పట్లో ఈ మహామ్మారి తగ్గేలా లేకపోవడంతో ఒక్కొక్కరిగా కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తమ వివాహాలను కానిచ్చే పనిలో పడ్డారు. తాజాగా నాగబాబు నిహారిక పెళ్లిపై స్పందించారు. నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో జరగనుంది. ఈమె ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నిహారిక కాబోయే భర్త అతడి పేరు జొన్నలగడ్డ చైతన్య అని. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నారు. మెగా కుటుంబానికి జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. ఆ కారణంగా నిహారికి వాళ్ల ఇంటి కోడలు కాబోతుంది. వీరి పెళ్లి జరగడానికి మెగాస్టార్ చిరంజీవి వెనకాల తంతు అంతా నడిపించారు.

తాజాగా నాగబాబు తన కూతురు పెళ్లిపై స్పందించారు. తన కూతురు నిహారిక పెళ్లి ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలకు లోబడే చేస్తానన్నారు. ఏదో హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని నాగబాబు అన్నారు. అయితే మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిహారిక, చైతన్యల నిశ్చితార్ధం ఆగష్టు 13న జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి డేట్ పై మాత్రం స్పష్టత రాలేదు.

Tags :
|

Advertisement