Advertisement

ప్రతి విషయానికి ఒప్పుకునే భర్త నాకు వద్దు

By: Dimple Fri, 28 Aug 2020 3:55 PM

ప్రతి విషయానికి ఒప్పుకునే భర్త నాకు వద్దు

తాగొచ్చి కొడుతున్నాడనో… అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని విడాకులు తీసుకున్నవాళ్ళ గురించి విన్నాం. కొంచెం సిల్లీగా ఉన్నా గురక పెడుతున్నాడనో, స్నానం చేయట్లేదనో విడాకులు తీసుకున్నవాళ్ళను కూడా చూశాం. కానీ గొడవ పడట్లేదని కోర్టు మెట్లెక్కిన భార్య గురించి ఎక్కడైనా విన్నామా? అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

తన భర్త తనతో గొడవ పడలేదన్న కారణంతో విడాకులు కావాలని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. 18 నెలల క్రితం వివాహం జరిగిన ఓ మహిళ తనకు విడాకులు కావాలంటూ ఇటీవల షారియా కోర్టును కోరింది. అందులో తన భర్త ప్రేమను తాను భరించలేకపోతున్నానంటూ పేర్కొంది. అతడు నా మీద ఎప్పుడూ గట్టిగా అరవడు. నన్ను ఎప్పుడూ నిరాశ చెందనివ్వడు. ఆ వాతావరణం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి నాకు అతడే వంట చేస్తాడు. నా ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. నేను తప్పు చేసినా నన్ను క్షమిస్తాడు. అతడితో ఏదైనా వాదించాలనిపిస్తుంటుంది. ప్రతి విషయానికి ఒప్పుకునే భర్త నాకు వద్దు అంటూ తన పిటిషన్‌లో పేర్కొంది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు. ఇదొక పనికిమాలిన చర్య అంటూ ఆమె పిటిషన్‌ని కొట్టివేసింది. ఈ క్రమంలో ఆమె మళ్లీ స్థానిక పంచాయితీని ఆశ్రయించగా వారు కూడా మేమేం చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇక ఈ విషయాన్ని భార్య, భర్త నే పరిష్కరించుకోవాలంటూ కోర్టు వెల్లడించింది. కాగా మరోవైపు తన భార్యను ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలనుకుంటానని ఆమె భర్త తెలిపారు. నా మొగుడు శాడిస్ట్ అంటూ ఎంతోమంది అమ్మాయిలు మొత్తుకుంటుంటే… భార్యను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్న భర్తకి విడాకులు ఇవ్వడమేంటి? అని సాటి ఆడవాళ్ళూ గొణుక్కుంటున్నారు.

Tags :
|
|
|
|
|

Advertisement