Advertisement

అమెరికా లో “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” విరాళం

By: chandrasekar Thu, 28 May 2020 11:53 AM

అమెరికా లో  “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” విరాళం


అమెరికా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా న్యూయార్క్ నగరం ఈ కరోనా కారణంగా దారుణంగా దెబ్బతింది. న్యూయార్క్ లో నమోదైన కరోనా మరణాల్లో 20% ఫ్రంట్ లైన్ కార్మికులు మరియు వైద్యులే ఉన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అక్కడి వైద్యులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ చాలా శ్రమిస్తున్నారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకు “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” ముందుకొచ్చింది. ‘గో ఫండ్ ‌మి’ అనే పేరు మీద విరాళాల సేకరణ ప్రారంభించి వారికి చేయూతగా నిలిచింది.

కరోనా పోరాటంలో భాగంగా “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” ‘గో ఫండ్ ‌మి’ నిధుల సేకరణను ప్రారంభించింది అని “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” ప్రెసిడెంట్ దినేష్ దొండపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్లను స్థానిక ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అందించేందుకు పలువురి నుండి విరాళాలను సేకరించడం ప్రారంభించారు. మంచి పని కోసం మంచి మనసుతో ప్రయత్నిస్తే ఆ పని తప్పక విజయవంతం అవుతుంది అని మన పెద్దవాళ్లు అన్నట్లు కేవలం రెండు వారాల్లోనే తమ లక్ష్యాన్ని చేరుకున్నారు ఆల్బనీ తెలుగు అసోసియేషన్.

donation of,albany,telugu,association,in america ,అమెరికా లో,  ఆల్బనీ, తెలుగు, అసోసియేషన్, విరాళం


సమాజానికి తమవంతు సాయంగా అసోసియేషన్ సభ్యులు వెయ్యి డాలర్లు విరాళంగా అందించారు. మొత్తం డబ్బులను కోవిడ్-19ను నివారించే KN95 మాస్కులకు ఉపయోగించాలని వారు నిర్ణయించి ఏకంగా 2500 మాస్కులను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఆ మాస్కులను ఇవ్వడానికి నిజంగా అవసరమయ్యే ప్రదేశాలను గుర్తించడానికి అనేక ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, వైద్యులు మరియు ఆసుపత్రి సంస్థ లతో కలిసి పనిచేసారు “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” బృందం. పెద్దమొత్తంలో కొనుగోలు చేసిన KN95 మాస్కులను ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో గుర్తించి ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, ప్రముఖ సెంటర్లకు మరియు ఫ్రంట్ లైన్ కార్మికులకు విరాళంగా ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకుంది “ఆల్బనీ తెలుగు అసోసియేషన్” బృందం.

Tags :
|
|

Advertisement