Advertisement

  • వర్చువల్ డిబేట్స్ కోసం నేను నా టైమ్ వేస్ట్ చేయనన్న డోనాల్డ్ ట్రంప్

వర్చువల్ డిబేట్స్ కోసం నేను నా టైమ్ వేస్ట్ చేయనన్న డోనాల్డ్ ట్రంప్

By: chandrasekar Fri, 09 Oct 2020 09:30 AM

వర్చువల్ డిబేట్స్ కోసం నేను నా టైమ్ వేస్ట్ చేయనన్న డోనాల్డ్ ట్రంప్


నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను వర్చువల్ డిబేట్స్ కోసం నేను నా టైమ్ వేస్ట్ చేయనని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి రెండవ అమెరికన్ ప్రెసిడెంట్ డిబేట్ వర్చువల్ మాధ్యమంలో ప్రారంభం కానుంది. అయితే దీనికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ప్రెసెడెన్షియల్ డిబేట్స్ కమీషన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ హాస్యాస్పదంగా చిత్రీకరిస్తున్నారు. ఈ మీటింగ్ వీడియో ద్వారా నిర్వహిస్తాం అని కమీషన్ తెలపగానే ట్రంప్ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై తాను పెద్దగా శ్రద్ద చూపలేదు.

ప్రస్తుతం వర్చువల్ డిబేట్స్ కోసం నేను నా టైమ్ వేస్ట్ చేయను. కంప్యూటర్ ముందు కూర్చుని మాట్లాడటం అనేది హాస్యాస్పదం అని ట్రంప్ కామెంట్ చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే కోవిడ్ -19 వైరస్ బారీన పడ్డారు. దాని వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందారు. దాంతో కమీషన్ వర్చువల్ డిబేట్ ప్రస్తావన తీసుకొచ్చింది. ట్రంప్ ఆరోగ్యం గురించి వైట్ హౌజ్ అధికారులు తగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం, ఆయన ఆరోగ్య విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల ఇలా చేయాల్సి వస్తోంది అని దీనికి తము అంగీకరిస్తున్నాం అని అమెరికా అధ్యక్షపోటీలో ఉన్న బిడిన్ టీమ్ తెలిపింది. కానీ ట్రంప్ నిరారించడంతో ఇప్పుడు జరుగుతుందో లేదో చూడాలి అంటున్నారు అక్కడి అధికారులు. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుపొందతారో వేచి చూడాల్సిందే మరి.

Tags :
|
|

Advertisement