Advertisement

  • ఈ ఏడాది చివరి నాటికీ వ్యాక్సిన్ వస్తుంది అని ప్రకటించిన ట్రంప్ ..ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది అని ప్రకటించిన పుతిన్

ఈ ఏడాది చివరి నాటికీ వ్యాక్సిన్ వస్తుంది అని ప్రకటించిన ట్రంప్ ..ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది అని ప్రకటించిన పుతిన్

By: Sankar Tue, 11 Aug 2020 6:33 PM

ఈ ఏడాది చివరి నాటికీ వ్యాక్సిన్  వస్తుంది అని ప్రకటించిన ట్రంప్ ..ఆల్రెడీ వ్యాక్సిన్  వచ్చింది అని ప్రకటించిన పుతిన్



ఈ ఏడాది చివ‌రి క‌ల్లా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. క‌చ్చితంగా వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ దేశంలో 65 మిలియ‌న్ల మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ట్రంప్ తెలిపారు.

త‌మ‌కు ద‌గ్గ‌ర‌లో ఏదేశం కూడా లేద‌న్నారు. వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన దేశాల్లో భార‌త్ రెండ‌వ స్థానంలో ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. చైనా వైఖ‌రి ప‌ట్ల అస‌హ‌నంతో ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు. చైనా మంచి చేయ‌లేద‌న్నారు. ఒక‌వేళ మేం ఎన్నిక‌ల్లో నెగ్గితే ఇరాన్ త‌మ‌తో ఒప్పందం కుదుర్చుకుంటుంద‌ని ట్రంప్ తెలిపారు.

చైనాతో డీల్ చేసుకోవాలా వ‌ద్దా అన్న అంశంలో సందేహం నెల‌కొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే సోమ‌వారం ట్రంప్ మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. వైట్‌హౌజ్ వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. దాంతో ఆయ‌న మ‌ధ్య‌లోనే మీడియా స‌మావేశాన్ని వ‌దిలి వెళ్లారు.

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాక్సిన్ ప్ర‌పంచంలో తొలిసారి కోవిడ్‌19 వ్యాక్సిన్‌కు ర‌ష్యా ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఆ టీకాను త‌న కూతురికి ఇచ్చిన‌ట్లు కూడా పుతిన్ తెలిపారు. మాస్కోకు చెందిన గ‌మేలియా ఇన్స్‌టిట్యూట్ ఆ టీకాను అభివృద్ధి చేసింది. ర‌ష్యా ఆరోగ్య‌శాఖ ఆ టీకాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పుతిన్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు పుతిన్ తెలిపారు.


Tags :
|

Advertisement