Advertisement

  • రాబోయే రెండు రోజుల్లో ఎంజరుగుతుందో చూడాలి ..తన ఆరోగ్యంపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ట్రంప్

రాబోయే రెండు రోజుల్లో ఎంజరుగుతుందో చూడాలి ..తన ఆరోగ్యంపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ట్రంప్

By: Sankar Sun, 04 Oct 2020 1:41 PM

రాబోయే రెండు రోజుల్లో ఎంజరుగుతుందో చూడాలి ..తన ఆరోగ్యంపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ట్రంప్


కరోనా బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన శ్వాస సంబంధ సమస్యతో బాధపడడంతో వైట్‌హౌస్‌ నుంచి ఆస్పత్రికి తరలించారు.. మహమ్మారి నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవడానికి.. రెమ్‌డెసివిర్ థెరపీ చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

అయితే, తన ఆరోగ్యపరిస్థితిపై తానే స్వయంగా స్పందించారు ట్రంప్.. ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. నేను ఇప్పుడు చాలా బాగున్నాను, కోవిడ్‌ కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను.. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేస్తాను.. రాబోయే రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. తదుపరి కొన్నిరోజులు నాకు నిజమైన పరీక్ష అంటూ తన వీడియోలో పేర్కొన్నారు ట్రంప్.

కాగా, ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వచ్చే 48 గంటలూ చాలా సంక్లిష్టమని వాల్టర్‌ రీడ్‌లో ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ఓ వ్యక్తి మీడియాతో తెలపగా.. ఆయన ప్రమాదం నుంచి బయటపడలేదు. అసలు ఎప్పటికి కోలుకుంటారన్న విషయమే డాక్టర్లు చెప్పలేని పరిస్థితి నెలకొంది.. దీంతో ట్రంప్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.. దీనిపై స్పందించిన ట్రంప్.. సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు.

Tags :

Advertisement