Advertisement

  • కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఇండోర్ ర్యాలీలో పాల్గొన్న డోనాల్డ్ ట్రాంప్

కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఇండోర్ ర్యాలీలో పాల్గొన్న డోనాల్డ్ ట్రాంప్

By: chandrasekar Wed, 16 Sept 2020 07:52 AM

కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఇండోర్ ర్యాలీలో పాల్గొన్న డోనాల్డ్ ట్రాంప్


కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఇండోర్ ర్యాలీలో డోనాల్డ్ ట్రాంప్ పాల్గొన్నారు. దీనిపై పలువురు మేధావులు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ తొలి ఇండోర్ ర్యాలీలో పాల్గొన్నారు. నెవాడాలో జరిగిన బహిరంగ సభలో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. వేల సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశంలో ట్రంప్ తోపాటు చాలా మంది ముఖాలకు మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. వీరంతా కనీస నింబంధలను కూడా పాటించలేదు.

అధ్యక్ష ఎన్నికల ర్యాలీ జరిగిన ప్రదేశంలో భౌతిక దూరాన్ని అనుసరించే ప్రయత్నమేదీ ట్రంప్ మద్ధతుదారుల్లో కనిపించలేదు. ట్రంప్ ప్రచార నినాదాలతో టోపీలు ధరించిన మద్దతుదారులు మడత కుర్చీలపై కూర్చున్నారు. తొలి ఇండోర్ ర్యాలీ ఆదివారం రాత్రి నెవాడాలోని స్టేడియంలో జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన నిబంధనలను తోసిరాజని సమావేశం జరుగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ర్యాలీలో హాజరైనవారిలో మూడో వంతు ప్రజలు ముఖాలకు కూడా మాస్కులు ధరించలేదు. కనీసం భౌతిక దూరం నిబంధనను కూడా మరిచిపోయి ఎగబడ్డారు. ర్యాలీకి హాజరు కావడానికి ప్లాంట్ లోపల స్థలం లేకపోవడంతో చాలా మంది బయట నిలబడి కనిపించారు. వీరిలో కొందరు చిన్న పిల్లలను వారితో తీసుకువచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన జో బిడెన్ పై విమర్శలు చేస్తున్న సమయంలో ట్రంప్ మద్దతుదారులు పెద్ద పెట్టున నినాదాలు చేసారు.

సమావేశంలో పోలీసులపై ప్రమాదకరమైన యుద్ధానికి దిగామంటూ బిడెన్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అంటున్న సమయంలో ఒక నిరసనకారుడు ట్రంప్ ప్రసంగానికి అడ్డుపడ్డాడు. దాంతో ట్రంప్ మద్దతుదారులు 'ఆల్ లైవ్స్ మేటర్' అంటూ గట్టిగా అరిచారు. ఇదే వేదిక నుంచి నెవాడాలో నివసిస్తున్న లాటిన్ అమెరికన్ దేశాల ప్రజలను ఆకర్షించడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఇండోర్ ర్యాలీకి ముందు నిర్వహించాల్సిన రెండు బహిరంగ ర్యాలీలను రిపబ్లికన్లు వాయిదా వేసుకున్నారు.

బహిరంగ ర్యాలీ కి గాను ఒకటి రెనో-తాహో విమానాశ్రయం హ్యాంగర్ లో జరుగాల్సిఉండగా విమానాశ్రయం అథారిటీ అనుమతివ్వకపోవడంతో వాయిదాపడింది. దీని తరువాత మరో ఐదు ప్రదేశాలలో ర్యాలీలు నిర్వహించే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. బహిరంగ ర్యాలీ యొక్క అన్ని వేదికలను నెవాడా గవర్నర్ అడ్డుకున్నారు. ట్రంప్ గతంలో జూన్ 20 న తుల్సా, ఓక్లహోమాలో స్టేడియంలో ర్యాలీ నిర్వహించారు. అయితే, ఆగస్టు 13 నాటికి నెవాడాలో 73,648 కేసులు నమోదుకాగా 1,454 మంది మరణించారు. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ నిబంధనలు పాటించకుండా రిపబ్లికన్లు ఇండోర్ ర్యాలీ చేపట్టడం పట్ల పలువురు మేథావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మరింతగా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదముంది.

Tags :

Advertisement