Advertisement

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్

By: chandrasekar Tue, 25 Aug 2020 08:58 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్


ఈ సంవత్సరం చివరిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ ను ఎన్నిక చేసారు. ప్రపంచ సూపర్ పవర్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి మొదలయింది. అధికార రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్ధుల్ని అదికారికంగా ఇప్పుడు ప్రకటించింది. మరోసారి డోనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్ లు అధ్యక్ష , ఉపాధ్యక్ష అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ మరియు డెమోక్రటిక్ పార్టీలు పోటీచేస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించారు.

ఈ యేడాది చివర్లో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ తన అభ్యర్ధుల్ని ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ తరపున అధ్యక్ష పదవికి జో బిడెన్ ను, ఉపాధ్యక్ష పదవికి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ లు పోటీ చేస్తున్నారు. ఇక అధికార పార్టీగా ఉన్న రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి డోనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్ లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఈ ఇద్దరు పేర్లను ప్రకటించింది. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే అయినా పార్టీ తరపున అధికారికంగా ఇప్పుడే ప్రకటించబడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.

Tags :

Advertisement