Advertisement

  • క్షిణిస్తున్న ట్రంప్ ఆరోగ్యం ... కృత్రిమంగా ఆక్సిజన్

క్షిణిస్తున్న ట్రంప్ ఆరోగ్యం ... కృత్రిమంగా ఆక్సిజన్

By: Sankar Sun, 04 Oct 2020 5:22 PM

క్షిణిస్తున్న ట్రంప్ ఆరోగ్యం ... కృత్రిమంగా ఆక్సిజన్


కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించింది. 40 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. వయోభారం కారణంగా ట్రంప్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

వాల్టర్ రీట్‌లోని జాతీయ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్‌కు కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆయన ఆక్సిజన్ లెవల్స్ 60 నుంచి 70 శాతానికి పడిపోయాయి. ఇప్పటికే ఆయనకు యాంటీ బాడీస్ మిశ్రమం ఎక్కించారు. రెమ్‌డెసివర్ థెరపీ చేస్తున్నారు. ట్రంప్ ప్రమాదం నుంచి బయటపడలేదని, ఎప్పటికి కోలుకుంటారో చెప్పలేమని డాక్టర్లు ప్రకటించారు.

గడచిన 24 గంటల్లో ఆయన ఆక్సిజన్ లెవల్స్ అత్యంత ఆందోళన కర స్థాయిలో పడిపోయాయని, వచ్చే రెండు రోజులు కీలకమైనవని డాక్టర్లు తెలిపారు. ట్రంప్ ఆరోగ్య వివరాలను వైట్‌ హౌస్ గోప్యంగా ఉంచుతోంది. అటు ఉపాధ్యక్షుడికి అధికారాల బదలాయింపుకు ట్రంప్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

Tags :
|

Advertisement