Advertisement

  • తన రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్

తన రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్

By: Sankar Thu, 03 Dec 2020 3:07 PM

తన రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కానీ ఆయన అపజయాన్ని అంగీకరించడం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌, మోసం జరిగిందని ఆరోపిస్తూ కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సంబంధించి ఓ చర్చ జరగుతుంది.

ఎన్నికల్లో ఓడిపోయారు.. రాజకీయాల్లో కొనసాగుతారా.. లేక తిరిగి తన పాత వ్యాపార జీవితంలోకి ప్రవేశిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగబోతున్నట్లు ప్రకటించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరో మారు పోటీ చేస్తానని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు.

వైట్‌హౌస్‌లో నిర్వహించిన క్రిస్టమస్‌ పార్టీలో ట్రంప్‌ తన రాజకీయ జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నాలుగేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్లు ప్రజలకు సేవ చేయాలని భావించాం. అందుకోసం ఎంతో శ్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. మరో నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ పరోక్షంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని వెల్లడించారు ట్రంప్‌

Tags :

Advertisement