Advertisement

  • చైనాలో కరోనా మరణాలు లక్షల్లో సంభవించాయి ..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

చైనాలో కరోనా మరణాలు లక్షల్లో సంభవించాయి ..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Wed, 02 Sept 2020 8:54 PM

చైనాలో కరోనా మరణాలు లక్షల్లో సంభవించాయి ..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


కరోనా పుట్టినిల్లు చైనా మీద మరొకసారి తీవ్ర విమర్శలు చేసాడు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ .. అమెరికాలో అత్యధికంగా 6 మిలియన్ల మందికిపైగా కరోనా వైరస్ బారిన పడగా.. 1.89 లక్షల మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 3.9 మిలియన్ల మంది కోవిడ్ బారిన పడగా.. 1.22 లక్షల మంది చనిపోయారు. మన దేశంలో 37 లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకగా.. 66 వేల మందికిపైగా చనిపోయారు. కానీ వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం ఇప్పటి వరకూ 85 వేల మంది మాత్రమే వైరస్ బారిన పడగా.. 4634 మంది చనిపోయారని ఆ దేశం ప్రకటించింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య పరంగా చైనా ప్రపంచంలో 38వ స్థానంలో ఉండటం గమనార్హం.

అయితే చైనా చెబుతున్న ఈ గణాంకాలు తప్పని మొదటి నుంచి చెబుతోన్న ట్రంప్.. ఈసారి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా చెబుతున్న దాని కంటే చాలా ఎక్కువగా వేలల్లో ఆ మాటకొస్తే లక్షల్లో కోవిడ్ మరణాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి ఆయన ఆధారాలేవీ చూపించలేదు. ఫాక్స్ న్యూస్‌కు చెందిన లారా ఇంగ్రహమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంతో పోల్చినా చైనాలోనే కరోనా మరణాలు ఎక్కువ. కానీ వాటిని బహిర్గతం చేయరు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా అమెరికాలో చివ‌రి దశకు చేరిన వ్యాక్సిన్ల సరసన ఆస్ట్రాజెనికా కూడా చేరింద‌న్న డొనాల్డ్ ట్రంప్.. 2021 జనవరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, సుమారు 300 మిలియన్ల డోసుల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇదే, సంద‌ర్భంలో శాస్త్ర‌వేత్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు ట్రంప్.. అసాధ్యం అనుకున్న పనిని అగ్రరాజ్యం సాధ్యం చేసి చూపిస్తోంద‌ని.. పరిశోధకుల పనితీరు భేష్ అంటూ కొనియాడారు..

Tags :
|

Advertisement