Advertisement

  • అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరుపున నామినేషన్ స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరుపున నామినేషన్ స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్

By: Sankar Fri, 28 Aug 2020 12:22 PM

అమెరికా అధ్యక్ష పదవికి  రిపబ్లికన్ పార్టీ తరుపున నామినేషన్ స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్షపదవికి డోనాల్డ్ ట్రంప్ నామినేషన్ స్వీకరించారు. నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ రెండోసారి రిపబ్లికన్ పార్టీ తరుపున నామినేట్ అయ్యారు. హృదయపూర్వక కృతజ్ఞతతో, అనంతమైన ఆశావాదంతో, అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేసారు.

అపూర్వమైన మద్దతుతో గౌరవంతో ప్రజల ముందు నిలబడ్డానంటూ ఆయన పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వల భవిష్యత్తు పై విశ్వసంతో ఉన్నామని అన్నారు. అంతే కాకుండా ప్రత్యర్థి అభ్యర్థి జో బిడెన్ పై విమర్శలు కురిపించారు. బిడెన్ అమెరికా ప్రతిష్టతను, ఉద్యోగాలను నాశనం చేస్తాడని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో ట్రంప్ కూతరు ఇవాంక ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఇవాంక మాట్లాడుతూ...ట్రంప్ కోవిడ్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు. ‘వాషింగ్టన్ డొనాల్డ్ ట్రంప్‌ను మార్చలేదు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌ను మార్చారు.’ అంటూ ప్రశంసించారు.

కాగా మెరటికాలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నపట్టికి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి..ఇప్పటికే డెమోకాట్రిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ ను ఎన్నుకుంది..ఇక మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన కమల హారిస్ బరిలోకి దిగుతున్న విష్యం తెలిసిందే..

Tags :

Advertisement