Advertisement

  • జొకోవిచ్ ను విమర్శించడం సరికాదు ..డొమినిక్ థీమ్ ..

జొకోవిచ్ ను విమర్శించడం సరికాదు ..డొమినిక్ థీమ్ ..

By: Sankar Wed, 15 July 2020 8:05 PM

జొకోవిచ్ ను విమర్శించడం సరికాదు ..డొమినిక్ థీమ్ ..



కరోనా కారణంగా అన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి ..అయితే ఇటీవల కాలంలో జకోవిచ్ ఆండ్రియా టోర్నీ పేరుతో టెన్నిస్ టోర్నీని నిర్వహించాడు ..అయితే ఆ టోర్నీ లో పాల్గొన్న ఆటగాళ్లలో జొకోవిచ్ తో పాటు ఇంకొంతమందికి కరోనా రావడంతో జొకోవిచ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి ..ఆటగాళ్లు ఏ మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించలేదు అని , పార్టీలు , పబ్బులలో ఎంజాయ్ చేసారని తీవ్ర విమర్శలు వచ్చాయి ..

ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ త్రీ టెన్నిస్ ఆటగాడు డొమినిక్ థీమ్.. జకోకు అండగా నిలిచాడు. ఈ టోర్నీ నిర్వహించడం ద్వారా జకో నేరమేం చేయలేదని డొమినిక్ పేర్కొన్నాడు. ‘జకోను ఇంతలా విమర్శించడం సరికాదు. మనందరం తప్పులు చేస్తాం. ఈ టోర్నీ నిర్వహించడం వెనుక ఎటువంటి దురుద్దేశం లేదుకదా. మంచి ఆలోచనతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించారు. అటువంటప్పుడు అదేదో నేరం చేసినట్లు జకోను నిందించడం సరికాదు’ అని డొమినిక్ చెప్పాడు. ఈ టోర్నీలో పాల్గొన్న నలుగురు టెన్నిస్ ఆటగాళ్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ వంటి గ్రాండ్స్లామ్ టోర్నీ లు రద్దు అయ్యాయి ..యు ఎస్ ఓపెన్ మాత్రం నిర్వహించేందుకే నిర్వాహకులు మొగ్గు చూపారు ..

Tags :
|

Advertisement