Advertisement

లాభాల బాటలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

By: chandrasekar Sat, 21 Nov 2020 10:56 AM

లాభాల బాటలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు


కొన్నిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో ప్రయాణిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యలో కాస్త నష్టాల్లోకి వెళ్లినప్పటికీ అంతకుమించి ఎగిశాయి. ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్లు లాభంతో ప్రారంభమైంది. ఉదయం గం.11 సమయానికి 43,830 పాయింట్లను తాకినప్పటికీ, కాసేపటికే నిన్నటి ముగింపు 43,600 కంటే దిగువకు చేరుకొని, 43,480 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం చివరి గంటలో కొనుగోళ్లు పెరిగి భారీ లాభాలు నమోదు చేశాయి. ఓ సమయంలో 44 వేల మార్క్ సమీపానికి చేరుకొని, చివరకు 282 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 87.30 పాయింట్లు అంటే 0.68 శాతం లాభపడి 12,859 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 282.29 పాయింట్లు అంటే 0.65 శాతం ఎగిసి 43,882.25 పాయింట్ల వద్ద ముగిసింది.

శుక్రవారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 9.19 శాతం, టైటాన్ కంపెనీ 5.62 శాతం, గెయిల్ 4.06 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.95 శాతం, కొటక్ మహీంద్ర 3.45 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 3.73 శాతం, అదానీ పోర్ట్స్ 1.58 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.86 శాతం, సన్ ఫార్మా 0.81 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.78 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ భారీగా పతనమైంది. ఏకంగా రూ.1900 దిగువకు చేరుకుంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 3.66 శాతం లేదా రూ.72 పడిపోయి రూ.1901 వద్ద ముగిసింది.

Tags :
|
|

Advertisement