Advertisement

  • విండీస్ - ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ..నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్

విండీస్ - ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ..నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్

By: Sankar Fri, 17 July 2020 09:45 AM

విండీస్ - ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ..నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్



తొలి టెస్ట్ ఓటమి నుంచి పాటలు నేర్చుకున్న ఇంగ్లాండ్ జట్టు ..వెస్ట్ ఇండీస్ తో నిన్న ప్రారంభం అయిన రెండో టెస్టులో తొలిరోజు నిలకడగా ఆడింది..పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలంగా ఏమి లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఆడిన ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. డామ్‌ సిబ్లీ (253 బంతుల్లో 86 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (159 బంతుల్లో 59 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 126 పరుగులు జోడించారు. విండీస్‌ బౌలర్లలో ఛేజ్‌కు 2 వికెట్లు దక్కాయి.

రెండో టెస్ట్ కూడా వర్షం కారణంగా ఆలస్యంగానే ప్రారంభం అయింది ..టాస్ ఒడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ తొలుత బావెర్లకు పిచ్ అనుకూలంగా ఉండటంతో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించింది ..లంచ్ సమయానికి ఒక వికెట్ కోల్పోయి ఇంగ్లండ్‌ 13.2 ఓవర్లలో 29 పరుగులు చేసింది ..రోస్టన్ ఛేజ్ బార్న్స్ ను అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు ..ఇక లంచ్ తర్వాత తొలి బంతికే జాక్‌ క్రాలీ (0) లెగ్‌స్లిప్‌లో హోల్డర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఇంగ్లండ్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది..

అయితే తొలి టెస్టులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన పేసర్‌ గాబ్రియెల్‌ 7 ఓవర్లు మాత్రమే వేసి గజ్జల్లో గాయంతో కొద్ది సేపు తప్పుకోవడం విండీస్‌ బౌలింగ్‌ను బలహీనపర్చింది.తొలి టెస్ట్ కు దూరమైన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ కొంచెం సేపు విండీస్ బౌలింగ్ ను ప్రతిఘటించాడు ..అయితే అల్జారీ జోసెఫ్ చక్కటి అవుట్‌స్వింగర్‌తో రూట్‌ను అవుట్‌ చేయడంతో 52 పరుగుల మూడో వికెట్‌ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది.

టీ విరామ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు 112 పరుగులకు చేరింది. మూడో సెషన్‌ మొదలయ్యాక సిబ్లీ 164 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిబ్లీ, స్టోక్స్‌ కలిసి చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చారు. పట్టుదలగా ఆడి క్రీజ్‌లో పాతుకుపోయిన వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. 68 పరుగుల వద్ద సిబ్లీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హోల్డర్‌ జారవిడవగా...కొద్ది సేపటికే 119 బంతుల్లో స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అనంతరం ఈ జోడీని విడదీసేందుకు విండీస్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయారు.

Tags :

Advertisement