Advertisement

  • పోస్టుమార్టంలో ఆమె మహిళ కాదు, పురుషుడని తెలిసి ఆశ్చర్యపోయిన డాక్టర్స్

పోస్టుమార్టంలో ఆమె మహిళ కాదు, పురుషుడని తెలిసి ఆశ్చర్యపోయిన డాక్టర్స్

By: chandrasekar Thu, 10 Sept 2020 3:01 PM

పోస్టుమార్టంలో ఆమె మహిళ కాదు, పురుషుడని తెలిసి ఆశ్చర్యపోయిన డాక్టర్స్


మధ్యప్రదేశ్‌లోని సెహరో‌లో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2012లో పెళ్లి చేసుకున్న ఆ జంట.. రెండేళ్ల తర్వాత ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఎనిమిదేళ్ల పాటు వీరి సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగానే సాగింది. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భార్య గత నెల 12న శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్తకు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలతో భార్య చనిపోయింది. ఆ తర్వాత భర్త కూడా చనిపోయాడు.

వీరి పోస్టుమార్టం రిపోర్టులు చూసిన పోలీసులు.. ఆశ్చర్యానికి గురయ్యారు. అతడి భార్య మహిళ కాదు, పురుషుడని తెలియడంతో వారి కుటుంబ సభ్యులను విచారించారు. అసలు గుట్టు చెప్పేందుకు వెనకడుగు వేశారు. అయితే, భర్త సోదరుడు పోలీసులకు అసలు విషయం చెప్పారు. వాస్తవానికి ఆ ఇద్దరు స్వలింగ సంపర్కులని, తమ వివాహాన్ని సమాజం అంగీకరించదనే ఉద్దేశంతో ఒకరు మహిళగా రూపం మార్చుకుని భార్యాభర్తల్లా జీవించడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఆమెను భార్యగానే చూసేవారు. చివరికి పోస్ట్‌మార్టం రిపోర్టుతో అసలు విషయం బయటపడింది.

ఇదే విధంగా ఇటీవల ఇండోనేషియాలో ఓ వ్యక్తి 25 ఏళ్ల యువతిని ఫేస్‌బుక్‌లో చూసి స్నేహం చేశాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత శోభనం రోజున అతడికి అసలు విషయం తెలిసింది. తాను పెళ్లి చేసుకున్నది యువతిని కాదు.. యువకుడునని. అలాగే.. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ.. ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివీటి సిండ్రోమ్‌తో బాధపడుతు హాస్పిటల్‌లో చేరింది. అప్పటికే ఆమె పెళ్లి చేసుకుని పదేళ్లు అవుతోంది. అయితే, వైద్య పరీక్షల్లో ఆమె మహిళ కాదు పురుషుడని తెలిసింది. చివరికి ఆమె సోదరీ కూడా పురుషడనే తెలిసింది. చిత్రం ఏమిటంటే వైద్య పరీక్షలు జరిగేవరకు వారు పురుషులనే విషయం వారికి కూడా తెలీదు.

Tags :

Advertisement