Advertisement

  • సొంత తమ్ముడి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన డాక్టర్

సొంత తమ్ముడి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన డాక్టర్

By: Sankar Tue, 08 Sept 2020 11:08 AM

సొంత తమ్ముడి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన డాక్టర్


అమ్మాయిలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. రోజుకో తరహా ఘటనలు వెలుగుచూస్తున్నాయి... బయటి వ్యక్తులే కాదు.. కుటుంబంలోని పెద్ద మనుషులు కూడా.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తమ పిల్లలపై కన్నువేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది..

కామపిశాచిగా మారిపోయిన ఓ డాక్టర్... తమ్ముడి కూతురుపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకువచ్చింది. ఈ ఘటనపై మాట్లాడిన ఏసీపీ నర్సింహారావు.. ఆదివారం రోజు ఓ ఇరువై ఏళ్ళ యువతి తమకు ఫిర్యాదు చేసింది.. ముందుగా ఆ యువతి షీటీమ్స్ ను ఆశ్రయించినట్టు తెలిపారు.

డాక్టర్‌గా పని చేస్తున్న తన పెద్దనాన్నే పలు మార్లు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు ఏసీపీ.. తనను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదు పేర్కొంది.. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి డాక్టర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు ఏసీపీ నర్సింహారావు.. లైంగికదాడి విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు వెల్లడించారు.

Tags :
|
|

Advertisement