Advertisement

  • అమెరికాలో ఈ ఏడాది చివరి నాటికీ మూడు లక్షల కరోనా మరణాలు

అమెరికాలో ఈ ఏడాది చివరి నాటికీ మూడు లక్షల కరోనా మరణాలు

By: Sankar Tue, 24 Nov 2020 7:43 PM

అమెరికాలో ఈ ఏడాది చివరి నాటికీ మూడు లక్షల కరోనా మరణాలు


అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి.

పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. కరోనా ఉధృతి ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరినాటికి కనీసం మూడు లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కరోనాను కట్టడి చేసే సామర్ధ్యం అమెరికాకు ఉందని, దానికి పౌరులు సహకరించాలని డాక్టర్ ఫాసి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. కరోనా నిబంధనలు పాటిస్తే వైరస్ కు అడ్డుకట్ట వేయవచ్చని డాక్టర్ ఫాసీ తెలిపారు..అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంధీ ..దీనితో చాల దేశాలు మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నాయి...

Tags :
|
|
|

Advertisement