Advertisement

మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా...?

By: chandrasekar Wed, 09 Dec 2020 3:05 PM

మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా...?


మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై చైనా, నేపాల్ దేశాలకు చెందిన ప్రభుత్వాలు కలిసి ఓ సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో ద్వారా మౌంట్ ఎవ‌రెస్ట్ 29,031.69 అడుగులు ఉన్న‌ట్లు గుర్తించారు. గతంలో చెప్పిన దానికంటే 2.8 మీటర్ల ఎత్తు ఎక్కువ. మౌంట్ ఎవరెస్ట్ ప‌ర్వ‌తం హైట్ విషయంలో చైనా, నేపాల్ మధ్య వేరే అభిప్రాయాలు ఉండగా తాజాగా చేసిన సర్వే తర్వాత ఆ రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్ర‌దీప్ గ‌యావాలీ మంగళవారం ఖాట్మండులో ఓ ప్రకటన చేశారు. ఈ వ‌ర్చువ‌ల్ మీట్‌లో చైనా మంత్రి వాంగ్ యూ కూడా పాల్గొన్నారు.

డిసెంబ‌ర్ 11ను అంత‌ర్జాతీయ మౌంటేన్ డేగా జరపనున్న కారణంగా మూడు రోజుల ముందే నేపాల్, చైనా ప్రభుత్వాలు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై ఈ ప్ర‌క‌ట‌న చేసినట్టు సమాచారం. నేపాల్‌లో 2015లో సంభవించిన భూకంపం వ‌ల్ల ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎత్తులో మార్పులు చోటుచేసుకుని ఉంటాయనే అనుమానాల నేపథ్యంలో నేపాల్ ప్ర‌భుత్వం, చైనాతో కలిసి మౌంట్ ఎవ‌రెస్ట్ ఎత్తును కొలిచింది. 1954లో అప్పటి భారత ప్రభుత్వం నేతృత్వంలో సర్వే ఆఫ్ ఇండియా విభాగం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 29,028 అడుగులు ఉన్నట్టు సర్వే తెలిపింది.

Tags :
|
|

Advertisement