Advertisement

  • సత్యరాజ్ తెలుగులో నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా...?

సత్యరాజ్ తెలుగులో నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా...?

By: chandrasekar Fri, 27 Nov 2020 4:20 PM

సత్యరాజ్ తెలుగులో నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా...?


సత్యరాజ్ ఈ పేరు చెబితే.. గుర్తు పడతారో లేదో కానీ.. కట్టప్ప అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ఈయనే. ఇక సత్యరాజ్ తెలుగులో ‘బాహుబలి’ కంటే ముందు పలు చిత్రాల్లో నటించారు. కానీ ఈయన మొదటి చిత్రం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాహుబలిలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటించడానేదాని కంటే జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి సినిమా మొత్తం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అనే పాయింట్ పైనే బాహుబలి రెండో పార్ట్ కనీవినీ ఎరగనీ విజయం సాధించింది. ఇక నటుడిగా సత్యరాజ్ కెరీర్ నల్లేరు మీద నడకలా సాగలేదు. సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు అపజయాలు ఉన్నాయి.

సత్యరాజ్ విషయానికొస్తే ముందుగా చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆపై హీరోగా తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి హీరోలు కూడా రీమేక్ చేసారు. చిరంజీవి నటించిన ‘ఆరాధన’, ‘ఎప్పీ పరశురామ్’ మోహన్ బాబు నటించిన ‘ఎమ్ ధర్మరాజు ఎం.ఏ వంటి సినిమాల తమిళ మాతృకలో హీరో సత్యరాజే కావడం విశేషం.

తెలుగులో కూడా ఈయన డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఆ సంగతి పక్కనపెడితే.. ఈయన తెలుగులో నటించిన తొలి చిత్రం శోభన్ బాబు హీరోగా నటించిన ‘ఇద్దరు కొడుకులు’. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అలరించారు సత్యరాజ్. ఆ తర్వాత ఈయన ‘ఖూనీ’, ‘దర్జా దొంగ’, ‘ఉక్కు సంకెళ్లు’ వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన ‘శంఖం’ సినిమాతో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆపై ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ ఆపై బాహుబలిలో కట్టప్పగా సత్యరాజ్ అభినయాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ తర్వాత వరుసగా తెలుగులో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. సత్యరాజ్‌లో మంచి నటుడే కాదు దర్శకుడు కూడా ఉన్నాడు. ఈయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Tags :
|
|
|

Advertisement