Advertisement

అలర్జీలు ఉంటే టీకా వేయవద్దు...

By: chandrasekar Thu, 10 Dec 2020 9:38 PM

అలర్జీలు ఉంటే టీకా వేయవద్దు...


బ్రిటన్‌లో కరోనా వైరస్‌కు టీకా అత్యవసర వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే, కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇద్దరు నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒక్క రోజులో వారికీ ఒళ్లంతా దురద, దద్దుర్లు, రక్త ప్రసరణలో తేడాలు కనిపించాయి. అందువల్ల బ్రిటషన్ ఔషధ నియంత్రణా సంస్థ ముఖ్య ప్రకటన చేసింది. ఇంతకముందు ఏవైనా ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారం కానీ తీసుకుని అలర్జీ వచ్చినవాళ్లు కరోనా వాక్సిన్ ను వేసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతేకాదు, వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని, అలర్జీలు ఏమైనా ఉంటే వారికి టీకాను వేయవద్దని ఆదేశించింది.

‘టీకా వేయించుకున్న చాలా మందికి అలర్జీ రాదు కరోనా నుంచి ప్రజలను రక్షించి ప్రమాదాలను అధిగమించవచ్చు ఈ టీకా భద్రత, నాణ్యత, ప్రభావం ఎంహెచ్ఆర్ఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పూర్తిగా నమ్మవచ్చు’ బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనీ పేర్కొన్నారు. ఏ వ్యక్తయినా గతంలో ఔషధాలు, ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అలర్జీ వంటి దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటే ప్రస్తుతం ఫైజర్ టీకాను తీసుకోవద్దని చెప్పారు. కొత్త వ్యాక్సిన్లు తీసుకునే వారిలో దుష్ప్రభావం రావడం చాలా సహజమని, దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. దుష్ప్రభావాలు కనిపించిన ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలూ కోలుకుంటున్నారని ప్రకటించారు. ఏదైనా టీకా, ఔషధం తీసుకున్నప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తే వైద్య పరిభాషలో దానిని అనాఫిలాక్సిస్ అంటారు. ఇది తీవ్రమైందేం కాదు, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది.

Tags :
|

Advertisement