Advertisement

  • చట్టబద్ధత లేని యాప్ లలో రుణాలు తీసుకోవద్దు ....తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

చట్టబద్ధత లేని యాప్ లలో రుణాలు తీసుకోవద్దు ....తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

By: Sankar Fri, 18 Dec 2020 8:32 PM

చట్టబద్ధత లేని యాప్ లలో రుణాలు తీసుకోవద్దు ....తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి


చట్టబద్దత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌ల పై ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు..

మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనవని, ఆర్‌బీఐ గుర్తింపులేని ఈ యాప్‌ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు.

Tags :
|
|

Advertisement