Advertisement

  • మోసపూరిత యాప్‌ల ద్వారా రుణాలు పొందవద్దు: డీజీపీ మహేందర్‌రెడ్డి

మోసపూరిత యాప్‌ల ద్వారా రుణాలు పొందవద్దు: డీజీపీ మహేందర్‌రెడ్డి

By: chandrasekar Sat, 19 Dec 2020 11:29 AM

మోసపూరిత యాప్‌ల ద్వారా రుణాలు పొందవద్దు: డీజీపీ మహేందర్‌రెడ్డి


గత కొంత కాలంగా ఆన్ లైన్ లో యాప్‌లు ద్వారా రుణాలు పొంది వారి వేధింపులు తట్టుకోలేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అడిగిన వెంటనే రుణాలు అందించి తరువాత ఎక్కువ మొత్తంలో వడ్డీలు మోపి వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకోసం వీరి వేధింపుల తట్టుకోలేక చాలామంది కష్టాలు పడుతున్నారు.

రాష్ట్రంలో ఈ యాప్‌ల ద్వారా నగదు రుణాలు తీసుకున్నవారు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటిని తిరిగి చెల్లించే క్రమంలో యాప్‌ నిర్వాహకుల నుండి వేధింపులను భరించలేక గత కొద్దిరోజులుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణ గ్రహీతలను ఇష్టానుసారం వేధించడంతో వారు ఏమి చేయాలో తోచక తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందుకుగాను రాష్ట్ర డీజీపీ ఒక ప్రకటనను ప్రస్తుతం విడుదల చేశారు.

అవసరాలకు అనుగుణంగా రుణాలు అందించే చట్టబద్దత లేని మనీ యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని ఇందుమూలంగా ప్రజలకు డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికోసం ఈ వలలో పడి వేధింపులకు పాల్పడే యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు అందించాలని కోరారు. దేశంలో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో రుణాలు అందించే సంస్థలకు ఆర్‌బీఐ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని తెలిపారు. ఇందుకోసం రుణ గ్రహీతలు మోసపూరితమైన వేధింపులకు గురిచేసే యాప్‌ల ద్వారా నగదు పొందవద్దని సూచనలు చేశారు.

Tags :
|
|

Advertisement